మేము రోజూ తినే బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనాలు తెలిస్తే మీరూ రోజూ తింటారు

By | May 25, 2021

చద్దన్నం ది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ప్రోబయోటిక్స్ అంటే బాడీ కి కావలసిన మంచి బ్యాక్టీరియా ఈచద్దన్నంలో పుష్కలంగా ఉంటాయి.త్రీమంత్స్ కి ఒకసారి 40 డేస్ ఈబ్రేక్ ఫాస్ట్ చద్దన్నం తినడం పిల్లలకు చాలా మంచిది.పిల్లలు చాలా స్ట్రాంగ్ గా హెల్దీగా అవుతారు.ఇమ్యూనిటీపవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది.డైజేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంతమందికి తరచుగా లూజ్ మోషన్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి పెద్దవాళ్ళ కైనా పిల్లలకైనా ఈ చద్దన్నం చాలా బాగా పనిచేస్తుంది.

ఈచద్దన్నంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకకప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ పోసి అన్నం వండుకోవాలి. అర లీటర్ పాలను కాచి ఉంచుకోవాలి ఒక గంట సేపు బియ్యాన్ని నానబెట్టి అన్నం వండుకోవాలి.ఈలోపు పాలనే కాచుకొని ఉంచుకోవాలి.రెండు గోరువెచ్చగా చల్లారే వరకు ఉంచి అన్నంలో పాలని పోసి అందులో పెరుగు వేసి తోడు వేయాలి.ఈ అన్నము పాలలో కలిసేలా గడ్డలు లేకుండా కలుపుకోవాలి.ఇలా తోడు పెట్టిన తర్వాత 12 నుండి 16 గంటల వరకు గ్యాప్ ఉండాలి.ఇలాచేస్తే మన బాడీ కి కావలసిన మంచి బ్యాక్టీరియా గ్రోఅవుతుంది.

ఇది రాత్రి 8 గంటలకి చేసుకోవాలి తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫస్ట్ టైం వరకు రెడీ అయిపోతుంది. అన్నం రెడీ అయిన తర్వాత ఇందులో కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు.ఉల్లిగడ్డ నీ మరియు పచ్చి మిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుని ఇక తినేయడమే,ఏది ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్

(97)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *