జయించిన భార్యాభర్తల మనోగతం.. ఆ 18 రోజులూ.

By | May 25, 2021

ఆభార్య భర్తలు గత నెలలో దైవదర్శనం నిమిత్తం తిరుపతి కి వెళ్లి వచ్చారు.రాగానే జ్వరం దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు ఈ అనుమానాలతో ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆవార్త వినగానే షాక్కు గురయ్యారు,అనంతరం మనో నిబ్బరంతో కరోనాను చేధించారు.మీర్పేట్ కార్పొరేషన్ లోని నందు నంది హిల్స్ కి చెందిన ఆరిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కొత్త కాపు నాగభూషణ్ రెడ్డి ఆయన భార్య విజయలక్ష్మి వాళ్ళిద్దరూ కరోనాని ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళ మాటల్లోనే చూద్దాం.

ఏప్రిల్ లో వాళ్ళు ఇద్దరూ తిరుపతి కి వెళ్లి వచ్చారు,మరుసటి రోజు నుంచి జ్వరం,జలుబు,దగ్గు, ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి.వాళ్లకు పరిచయస్థులైన లాల్ దర్వాజా లక్ష్మణ్ ని సంప్రదించారు.అక్కడే కరోనా పరీక్షలు చేయించారు ఇద్దరికీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విషయం తెలియగానే తెలియని భయాందోళన శరీరమంతా మొద్దుబారినట్లు అయింది,ఒకదశలో వాళ్లకు ఏమీ అర్థం కాలేదు లక్ష్మన్ ఎంతో ధైర్యం చెప్పాడు కరోనా అనే పదాన్ని మనసులోంచి తీసేయమని చెప్పారు. మామూలు జ్వరంల భావించి మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోమని డాక్టర్ వాళ్ళకి ధైర్యం చెప్పారు.యూ పి హెచ్ సి లో వాళ్ళిద్దరికీ మందులు ఇచ్చారు అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి వచ్చేది వారం తర్వాత సమస్య దూరమైంది బంధువులు స్నేహితులు రోజు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవారు అందరితో మాట్లాడటం వలన కరోనా భయం పోయింది. మనోధైర్యంతో దానిని జెయించారు కరోనా అనగానే భయం వేస్తుంది కానీ నిజంగా భయపడాల్సిన అవసరం లేదు.

దానిని కూడా మరో మామూలు జ్వరం లాగానే భావించాలి కొన్ని రోజుల తర్వాత మేము అదే నిర్ణయానికి వచ్చి 18రోజుల్లోనే మామూలు స్థితికి చేరుకున్నాం 18రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది.అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్న ప్రస్తుతం కొంత నీరసంగా ఉన్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు ఏవీ లేవు ఇక మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మా చిన్న కూతురు మా ఇంటికి వచ్చింది. ఆతర్వాత ఆమెకు సైతం జ్వరం రావడంతో టెస్ట్ చేపిస్తే పాజిటివ్ గా తేలింది.ఇంట్లో పై పోర్షన్లో నివసించే పెద్ద కూతురికి అల్లుడికి కూడా జ్వరం రావడంతో పరీక్ష చేయించుకున్నారు.వారికి కూడా పాజిటివ్గా అని నిర్ధారణ అయ్యింది వారు ముగ్గురు పై పోర్షన్లో ఉన్నారు మేము ఇద్దరం కింది పోర్షన్ లో ఉన్నాము.వారు కూడా 18రోజుల హోమ్ తర్వాత టెస్ట్ చేయించుకోగానే నెగిటివ్ వచ్చింది మావల్ల మరో ముగ్గురు కరోనా బారిన పడడంతో చాలా బాధపడ్డాను బంధుమిత్రుల ఆశీస్సులు దేవుడి దయవల్ల ఆ మహమ్మారి బారినుండి కోరుకున్నాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి రానందుకు చాలా సంతోషించాం.ఇప్పుడు అందరం బాగానే ఉన్నాము అని ఆదంపతులు ఇద్దరు చెప్పుకొచ్చారు.

(168)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *