ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది.సా.శ.2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉండేవిట! ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి 2011 వరకు మొబైల్ ఫోన్ల వినియోగదారులు 12.4 మిలియన్ల నుండి 6 బిలియన్లకు ఎగబాకింది. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమనగా ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతీవ్యక్తికి ఈ మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనం అయేయి. మొబైల్ ఫోన్ ” అనే ఇంగ్లీషు మాటని తెలుగులో దూరవాణి అంటున్నారు. “టెలి” అంటే దూరం, “ఫోన్” అంటే శబ్దం కనుక ఈదూరవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది.పూర్వకాలంలో ఈ టెలిఫోనులు గోడకి తగిలించో, బల్ల మీదనో, కదలకుండా ఒక చోట పడి ఉండేవి.కనుక ఫోనులో మాట్లాడాలంటే మనం ఫోను దగ్గరకి వెళ్లాల్సి వచ్చేది.

ఇటీవలి కాలంలో సెల్ ఫోనుల వల్ల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమానం పడుతూ ఉంటే కేన్సరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి హెచ్చరికలలో ఆధారం ఉన్న నిజం ఎంత ఉందో, ఆధారం లేని భయం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ సమస్యని కొంచెం లోతుగా పరిశీలించాలి.
(88)