సీతాఫలం తినడం వలన కలిగే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు……మీకోసం చూడండి .

By | January 20, 2021

సీతాఫలము /రామాఫలము :- శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్‌ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది.మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం,రామాఫలం, లక్ష్మణఫలాలు.

ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది.కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు.ఔషధ గుణాలు దీని ఆకులు, బెరడు, వేరు.ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట.మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు.వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్‌ డయేరియాని తగ్గిస్తుందట. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట. పోషకాలు: 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా. పిండిపదార్థాలు, 2.5గ్రా. ప్రొటీన్లు, 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.

సీతాఫలం: డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు తినకూడదా. ఎవరు చెప్పారు? ఇది  చదవండి ... | Sitaphal Myths And Facts: Here's Why You Must Have Custard  Apple This Season - Telugu BoldSky

ఇలా మేలు * ఈ ఫలాన్ని రసంరూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

* పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి.. పిల్లలకు తాగించాలి. సత్వర శక్తి లభిస్తుంది.

* ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. * మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది.

* హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

* డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.

* పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది

. * సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. పండే కాదు..

ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. ఉపయోగాలు సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది. దీనిలో విటమిన్ ‘సి’ సంవృద్దిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.

(143)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *