ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్ని కత్తిరించేది, కేన్సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.

పోషక విలువలు :-
- ప్రతి 100 గ్రాములలో లభ్యమయే పోషక విలువలు ఈ దిగువ చూపిన విధంగా ఉంటాయని అంచనా వేసేరు:
2 .శక్తి 149 కేలరీలు
కర్బనోదకాలు (కార్బోహైడ్రేట్లు) : 33.6 గ్రాములు
చక్కెర: 1.00 గ్రాము
పోషక పీచు (ఫైబర్) : 2.1 గ్రాములు
కొవ్వు పదార్ధాల: 0.5 గ్రాములు
ప్రాణ్యములు (ప్రొటీనులు) : 6.39 గ్రాములు,
బిటా కారొటిన్ 0%,
విటమిన్ బి: నిత్యావసరంలో 15%,
విటమిన్ బి2: నిత్యావసరంలో 7%,
విటమిన్ బి3: నిత్యావసరంలో 5%,
విటమిన్ బి5: నిత్యావసరంలో12%,
విటమిన్ బి6: నిత్యావసరంలో 95%,
విటమిన్ బి9: నిత్యావసరంలో 1%,

వెల్లుల్లి ఔషదంగా:-
వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక యాసిడ్ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

వెల్లుల్లి మీద చేసిన అనేక అధ్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. లూయీ పాశ్చర్ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన గాంగ్రీన్ వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు ఐరోపా దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు, మొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు.
(250)