మజ్జిగలో ఇది కలిపి తాగితే, ఎంతటి వేళ్ళాడే పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

By | January 19, 2021

హలో ఫ్రెండ్స్.. ఈ రోజు మనం వీరమాచినేని గారి డైట్ లో భాగంగా వెయిట్ లాస్ మజ్జిగ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీన్ని మనం అందరం ఇంట్లో సులువుగా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఈ మజ్జిగ తో పొట్ట కూడా తగ్గించుకోవచ్చు, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని తయారీ విధానం దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే.. పెరుగు, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చి మిర్చి, నిమ్మకాయ, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర.

మజ్జిగలో ఇది కలిపి తాగితే, ఎంతటి వేళ్ళాడే పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

ఇప్పుడు దీని తయారీ విధానాన్ని ఎలాగో చూద్దాం, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి, అందులో ఒక ఆఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి, ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి దాంతో పాటు కట్ చేసి ఉంచుకున్న పుదీనా మరియు కరివేపాకు కూడా వేసుకోండి. కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. ఈ లోపు మనం మజ్జిగ ని తయారు చేసుకోవాలి, ఈ మజ్జిగ తయారుచేయడానికి రెండు చెంచాల పెరుగు తీసుకుని దానికి ఆఫ్ లీటర్ వాటర్ ని యాడ్ చేయండి, దీన్ని బాగా కవ్వంతో గిల కొట్టుకోవాలి పెరుగు నీళ్లు బాగా కలిసిపోయేలాగా గిల కొట్టుకోవాలి. దీనికి మనము చిన్నగా ముక్కలు చేసిన పచ్చిమిర్చి మరియు చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలు కూడా కలుపుకోవాలి. దీంతో పాటు కొంచెం దంచి ఉంచుకున్న అన్నం వేసుకోవాలి. ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేసి రసాన్ని అందులో పిండి, ఇప్పుడు మొత్తానికి ఒకసారి కలియబెట్టండి.

ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో మనము ముందుగా తయారు చేసుకున్నా మరిగించి పెట్టుకున్న నీటిని దీనిలో వడపోసుకోవాలి. ఈ రెండు కలిసే విదంగా మళ్లీ ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మజ్జిగని వేరొక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రాకుండా వడపోసుకోవాలి. ఇప్పుడు మీకు వీరమాచినేని గారి టెస్ట్ అయిన మజ్జిగ తయారయినట్టే, దీనిని తీసుకోవడం వలన మీకు పొట్ట తగ్గిపోతుంది, అలాగే వెయిట్ కూడా తొందరగా తగ్గుతారు. అలాగే గ్యాస్, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు తొందరగా ఉపశమనం పొందుతారు. చాలా సింపుల్ గా అందరూ చేసుకునే విదంగా ఉన్న ఈ మజ్జిగ ని తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి

(53839)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *