గృహిణి ఇంట్లో ఆ పనులు చేస్తే అష్టకష్టాలే..

By | January 18, 2021

ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు. ఎందుకంటే ఆ తల్లి కరుణ ఉంటేనే ఇల్లు విరాజిల్లు తాయి. అయితే మన ఇంట్లోనే ఆడవారు తెలుసో తెలియకో చేసే పనులు కొన్ని కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.. ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అలిగి పోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం వేళ పక్కింటి వాళ్ళు పాలు పెరుగు అడుగుతుంటారు. అడగ్గానే చాలా మంది ఇస్తుంటారు. అలా చేయకూడదట. పాలు అంటే లక్ష్మీదేవి రూపమట.

అలాంటప్పుడు పాలను అడగ్గానే ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లి పోతుంది అంట. ఇక మనం తీసుకున్నా ఆహారాన్ని వంట ఇంట్లో వండుతాం . అంటే అన్నపూర్ణ దేవి లక్ష్మీ రూపంలో కొలువై ఉంటుంది అని అర్థం. కాబట్టి మనం వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రకు ఉపక్రమించక ముందే గ్యాస్ స్టవ్ ను వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. అలా చెయ్యకపోతే లక్ష్మీదేవి మీపై అలిగి వెళ్లి పోతుందట. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇక చాలా మంది మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యంగా ఉంటుందని జుట్టును విరబోసుకుని నిద్రపోతుంటారు.

ఇలా చేయడం మనుషులు చేసే పని కాదు. రాక్షసులు చేసే పని. రాక్షస కృత్యాలు చేసే ఇంట్లో లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టపడదు. ఇక ఉప్పు అంటే సిరులు తల్లి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే రాత్రివేళల్లో ఉప్పు తీసుకుని కొద్దికొద్దిగా పొట్లాలు కట్టి ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో పెట్టాలి. తెల్లవారుజామున ఇంటి గృహిణి లేచిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పారేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది. మీరు వాడే చీపురు ఎల్లప్పుడూ దక్షిణ దిక్కునే ఉండాలి. వేరే దిక్కున పెట్టకూడదు. ఇలా ఉంటే ధనలక్ష్మి ఆకర్షితురాలై మీ ఇంట్లోకి వస్తుంది.

ఇక చాలామంది నిద్రపోయే ముందు గ్లాసుల్లో నూ లేదంటే జగ్గు ల్లోనూ మీరు నింపుకుని తల వద్ద పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి పూట దప్పిక అయితే తాగేందుకు. కానీ అలా చేయకూడదట. దప్పిక అయితే కిచెన్ లోకి వెళ్లి తాగాలి. అంతేగాని నీటిని దగ్గర పెట్టుకుంటే ధనప్రాప్తి కలగదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తే నీకు సిరి సంపదలు మీ ఇంట కొలువు తీరుతాయి.

(200)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *