ఒక్క ఉలవలు తింటే ఇన్ని లాభాలా..

By | January 19, 2021

ఉలవల గురుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరు. ఉలవలను ముఖ్యంగా చారు చేసుకొని తింటారు, అంతే కాకుండా ఉడకపెట్టి గుగ్గిళ్ల రూపంలో కూడా తీసుకుంటారు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. అందుకే ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు.

ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఉలవలకు ఆకలిని పెంచే శక్తి ఉంది, అందుకే దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి. అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.

Amazing Health Benefits of ulavalu

అలాగే మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. మూత్ర సమస్యలు ఉన్నవారు ఒక కప్పు చొప్పున ఉలవచారు మరియు కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది. ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. మేలైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి, చల్లారిన తరువాత పిండిపట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు. ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు. ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.

Amazing Health Benefits of ulavalu

NOTE..అదేపనిగా రోజూ ఉలవలు తినటం వల్ల వేడిచేయవచ్చు. అందుకే ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా పుచ్చుకుంటే ఈ సమస్య రాదు. ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి గనుక ఎలాంటి హడావుడి లేని రోజుల్లో ఉలవల వంటకాలు చేసుకోవాలి.

(6632)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *