ఇది వాడితే వంటల్లో రుచికరమైన పులుపుతో పాటు, ఆరోగ్యం ఎలానో చూడండి.

By | January 17, 2021

మనం వండుకునే వంటలు రుచి రావాలంటే, ఆ షడ్రుచులలో ఒక రుచి పులుపు. ఈ పులుపు కోసం ప్రతి ఒక్కరం ఉపయోగించేది చింతపండు.ఇది ప్రకృతి ప్రసాదించింది కాదా, న్యాచురల్ అని మీరు అనుకుంటున్నారా? ఈ నేచర్ మనకు అనేక ఆహార పదార్థాలను ఇచ్చింది, వాటిని మనం నిత్యం వాడుకోవచ్చు అదేవిధంగా నేచర్ మనకు అనేక ఔషధాలను కూడా ఇచ్చింది సమయోచితంగా వాడాలి, నేచర్ అనేక విషాలను కూడా ఇచ్చింది కావాలనుకున్నప్పుడే వాడాలి. ఈ మూడింటిని విచక్షణతో వాడాలి. ఈ చింతపండు ఆహారమా? ఔషధమా, విషమ? మీరు ఖచ్చితంగా ఆహారం అని అనుకుంటారు కానీ వాస్తవానికి చింతపండు ఆహారం కాదు ఇది ఒక ఔషధం. ఇది ఒక విరోచనకారి నేచురల్ laxative మలబద్ధకాన్ని తగ్గించడానికి మన ప్రేగులు శుభ్రం చేయడానికి చింతపండు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం చింతపండుని మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి, ఆహారం అరగక ఇబ్బంది పడేవారికి ఈ చింతపండు నానబెట్టి గుజ్జు తీసి దీనిలో మిరియాలు, ధనియాలు వేసి కషాయంలా కాచి తీసుకోవాలని సూచించారు.

వంటల్లో రుచికరమైన పులుపుతో పాటు ఆరోగ్యం ఎలానో చూడండి

మనము రాను రాను వంటల్లో పులుపు కోసం ఈ చింతపండుని వాడటం మొదలు పెట్టాము, చింతపండు రోజు వాడటం వాడటం వలన ఇబ్బందులు ఏమిటంటే మన ప్రేగుల కదలికలు పెంచేస్తుంది. మనకు మలబద్ధకం సాఫీగా రావాలంటే పేగుల్లో కదలికలు కావాలి కానీ ఈ చింతపండు తీసుకోవడం వల్ల రెట్టింపు అవుతాయి.అందుకే నిత్యం చింతపండు వాడటం వల్ల తన సహజత్వాన్ని కోల్పో తాయి. ఈ చింతపండు వేసిన వంటల్లో ఇతర రుచులు కూడా ఎక్కువగా పడతాయి. ఏ కూరలో నైతే మనము చింతపండు పులుసు వాడుతామో ఆ వంటల్లో నూనె, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా పడుతుంది. మామూలుగా వండిన వంటల కంటే చింతపులుసు వాడి ఉండిన వంటల్లో రెండు రెట్లు ఎక్కువగా ఎక్కువగా ఇవి పడతాయి. అందుకనే ఈ కూరలు త్వరగా చెడిపోవటం జరగదు. పులిసి పోయి గ్యాస్ సమస్యలు వస్తాయి, అందుకే డాక్టర్లు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళని చింతపండు వాడవద్దు అని చెబుతారు. సమస్య ఒక చింతపండుది కాదు, చింతపండు వాడటం వల్ల నూనె, కారం, ఉప్పు, మసాలా, ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది.

చింతపండు వలన కలిగే ఆరోగ్యలాభాలు/Tamarind Health Benefits &Secrets  &Uses/Amazing Benefits of Tamarind - YouTube

చింతపండుని చాలా తక్కువగా అవసరాన్నిబట్టి వాడటం మంచిది. చింతపండుకు బదులుగా మరేమీ వాడుకోవాలంటే? చింత కాయలు చాలా మంచివి, చింతకాయలో కేవలం పులుపు మాత్రమే ఉంటుంది, కానీ పండు అయిన తర్వాత దానిలో మెడిసిన్ తయారవుతుంది. ఈ పచ్చి చింతకాయలో laxative ఇంకా డెవలప్ కాదు. అంతేకాకుండా పచ్చిమామిడికాయలు కూడా మనము పులుపుకు వాడొచ్చు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసి అన్ని రకాల కూరల్లో పులుపు కోసం వాడుకోవచ్చు. అదేవిధంగా ఉసిరికాయలు కూడా వాడవచ్చు, అంతేకాకుండా మనము రెగ్యులర్గా వాడే టమోటాను కూడా వాడవచ్చు, నాటు టమాటాలు అయితే చాలా మంచిది. అద్భుతమైన పులుపు కోసం నిమ్మకాయ వాడొచ్చు, ఇది మనకు అందుబాటులో సంవత్సరం మొత్తం దొరుకుతాయి. ఇది వంటలు వండే టప్పుడు వాడొచ్చు లేదా వండిన తరువాత కూడా వాడొచ్చు.

(269)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *