అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు.

By | January 18, 2021

అన్నం మానేస్తే సన్న పడతారు, అన్నం మానేస్తే షుగర్ తగ్గుతుంది,అన్నం మానేస్తే బీపీ తగ్గుతుంది, అన్నం మానేస్తే పొట్ట తగ్గుతుంది అంటూ ప్రచారం చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య లో అన్నం తినాలా వద్దా, అన్నం తింటే రోగాలు వస్తాయా అనే సందేహాలు మానుకొని హాయిగా అన్నం తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండటానికి అన్నం మానవలసిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న కార్యక్రమాల వల్ల తెల్లటివి మానుకోవాలని ప్రచారం జరుగుతుంది. కానీ వాటికి ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

rice benefits

ఆరోగ్యంగా జీవించాలంటే అన్నం మానుకోవలసిన అవసరం లేదు. అన్నం తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది అబద్ధం. మన పూర్వీకులు అన్నం తిని ఆరోగ్యంగా జీవించారు మనకంటే ఆరోగ్యంగా కూడా జీవించారు. దీన్నిబట్టి అన్నంతో సమస్య లేదని అర్థమవుతుంది. అన్నం మానేస్తే బరువు తగామని చాలామంది అంటున్నారు. బరువు, లావు పెరిగిన తర్వాత, తగ్గటానికి కొంత మంది అనేక రకాల ఆహార పద్ధతులు అనుసరిస్తున్నారు. ఆ తరువాత తగ్గడానికి కారణం అన్నం మానుకోవడం అనే నిర్ధారణకు వస్తున్నారు. సాధారణ ప్రజల కంటే కష్టం చేసేవారు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా తింటారు కానీ, వాళ్ళు వీళ్ళ కంటే ఎక్కువ లావుగా ఉండాలి కదా.. కానీ దానికి విరుద్ధంగా ఉంది. తక్కువ అన్నం తినే వారి కంటే ఎక్కువ అన్నం తినే శ్రామికులు పొట్ట లేకుండా కండలు తిరిగి ఉంటారు. దీన్ని బట్టి సమస్య శారీరక శ్రమ లేకపోవడమే అని అర్థమవుతుంది.

అమెరికాలో అన్నం తినరు, కానీ ప్రపంచంలో ఒబిసిటీ సమస్య అధికంగా ఉన్న దేశం అదే.. ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా అదే పరిస్థితి కదా. అన్నం తింటే రక్తం లోకి అధిక కేలరీ శక్తి వస్తుందని అంటారు గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రకారం బియ్యం మరియు ఇతర ధాన్యాల ఇండెక్స్ దాదాపుగా సరిగ్గా ఉంటుంది. అన్నం తింటే రక్తంలో కి ఎక్కువ శక్తి వచ్చేది నిజమే వాస్తవానికి ఎవరు అన్నం మాత్రమే తినరు అన్నంలో కూర, పెరుగు ఇతర పదార్ధాలు కూడా కలుపుకొని తింటారు. కాయకూరల ఇండెక్స్ ధాన్యాల ఇండెక్స్ లో సగం కూడా ఉండదు అన్నం లో ఇవి కలవడం వల్ల ఆహారం తిన్న తర్వాత రక్తంలో విడుదలయ్యే కేలరీలు తగ్గుతాయి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. బియ్యం ఆరోగ్యకరమైన ధాన్యం ఇందులో గ్లుటిన్ ఉండదు. మైదాలో, గోధుమపిండి లో ఉంటుంది. గ్లుటిన్ కొన్ని రోగాలు ఉన్న వారికి హాని చేస్తుంది. గంజి అన్నం, మెత్తటి అన్నం శరీరంలో ఎటువంటి హానీ చేయవు అన్నం లో ఏ విటమిన్ ఉంటుంది, అలాగే అనేక పోషకాలు కూడా ఉంటాయి. అన్నం మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య వస్తుంది. అన్నం రోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల విరేచనం సాఫీగా అవుతుంది. చూశారు కదా అన్నం రోజు తీసుకుంటే మన శరీరానికి ఎన్ని లాభాలో అందుకే అన్నం తినాలా వద్దా అనే అపోహ పోగొట్టుకోండి.

వేడి వేడి అన్నంలో నెయ్యి, ఆవకాయ కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో, అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి కందిపప్పు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు వేడి వేడి అన్నంలో సాంబారు కూడా బాగానే ఉంటుందని మరికొందరు అంటారు. ఇదంతా కాదు చికెన్ కర్రీతో వేడి వేడి అన్నం తింటే ఆ మజానే వేరు అని మరి కొందరు చెబుతుంటారు. వీరందరూ ఎన్ని చెప్పినా వాటిలో ఉన్న రుచి మన నాలుకకు తలగాలంటే వేడి వేడి అన్నం తప్పనిసరి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే నోట్లో లాలాజలం ఊరుతుంది కదా.. ఇది మనం ఎప్పటినుంచో చేస్తున్న పని. తిన్న ప్రతిసారి వేడి వేడి అన్నం తినడం మంచిదేనా అంటే మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజంగా వేడివేడి అన్నం తీసుకోవడం వలన శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అన్నం వేడివేడిగా తినకుండా కాస్త చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు తినాలని సూచిస్తున్నారు. అన్నాన్ని బాగా వేడిగా ఉన్నప్పుడు కానీ బాగా చల్లగా ఉన్నప్పుడు కానీ తీసుకోకుండా మితంగా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

ముఖ్యంగా వండుతున్న బియ్యానికి నాలుగు రెట్లు నీటిని కలిపి ఉడికించి తింటే శరీరానికి మరింత శక్తి లభిస్తుందట, వేసవిలోనే కాకుండా అన్నం తిన్న ప్రతిసారి మజ్జిగతో కొద్దిగా తింటే మూల రోగం తగ్గడమే కాక నీరసం అలసట దరిచేరదు. మన భారత దేశంలో అధికంగా తీసుకునే ఆహారంలో బియ్యం మరియు గోధుమలు ముఖ్యమైనవి. వీటిలో ఏది మంచిది అనే అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు. మధుమేహం ఉన్న వారిని అన్నం తగ్గించి చపాతీ ని ఎక్కువగా తీసుకోమని సలహా ఇస్తుంటారు. అయితే వాస్తవానికి ఏది మంచి ఆహారం అని డైటీషియన్లు చెప్తున్న ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. గోధుమ పిండితో నూనె లేకుండా చేసుకునే చపాతీలు మరియు బియ్యం మధ్య తేడాలు చూస్తే వైట్ రైస్ కంటే గోధుమ పిండితో చేసే చపాతీలలో ప్రోటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడు రెట్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, పది రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. పైగా రైస్ కంటే గోధుమలు గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ, అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే చపాతీ లో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది ఇందువల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలి తెలియదు.

బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహం ఉన్న వారికి ఇదే ఇబ్బందికరమైన విషయం అదే గోధుమ పిండి లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల నిధానంగా జీర్ణం అవుతూ కార్బోహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో micro-nutrients ఎక్కువగా ఉంటాయి. తక్కువ తిన్నా కూడా కడుపు నిండిన భావన కావాలనుకునే వారికి బ్రౌన్ రైస్ చాలా మంచివి. షుగర్ వ్యాధి ఉన్నవారికి, గుండె వ్యాధులు ఉన్నవారికి చపాతీలే చాలా మంచివి. మిగతా వారు నిరభ్యన్తరంగా ఎన్నో తినొచ్చు. మనో మూడు పూటలు అన్న కాకుండా ఒక పూత చపాతి అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

(6546)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *