అమ్మవారి ఆలయంలో అపశృతి.. ఆందోళనలో భక్తులు

By | June 8, 2019

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. నవ వజ్రాలతో పొదిగిన అమ్మవారి కిరీటంలో ఒక వజ్రం కనిపించకుండా పోయింది. దీనిని భక్తులు చూశారు… పూజారులు అధికారులు మాత్రం ఈ విషయాన్ని గమనించలేకపోయారు. భక్తులు దీని గురించి అడిగితే… అభిషేకం చేసేటప్పుడు ఊడి పడిపోయి ఉంటుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. కొన్ని రోజులుగా అమ్మవారి మకుటంలో పచ్చ రాయి లేకుండానే పూజారులు అభిషేకాలు నిర్వహిస్తుండడం విశేషం. అయితే దీనిపై అధికారులను ప్రశ్నిస్తే తిధి, నక్షత్రం చూసి అమ్మవారి మకుటంలో ఆ వజ్రాన్ని అమరుస్తామంటూ సమాధానం చెబుతున్నారు. ఇది ఎప్పుడు జరిగిందన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. మీడియా వెలుగులోకి తెచ్చేదాకా దీనిపై ఆలయ అర్చకులు, అధికారులు గోప్యతను పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related image

2006 సెప్టెంబర్‌లో హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన చలసాని వెంకటరమణ అనే భక్తుడు తన తండ్రి రాఘవేంద్రరావు జ్ఞాపకార్థం అమ్మవారికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. కిరీటంలో 2 కర్ణ పత్రాలతో పాటు, నాలుగు తెలుపు రత్నాలు, 5 ఆకు పచ్చ రత్నాలు, 1 ఎరుపు రత్నం పొదిగి ఉన్నాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కిరీటంలోని ఒక ఆకు పచ్చ రత్నం మాయమయ్యింది. దీనిని ఎవరైనా కాజేశారా.. లేక పూజ చేసే క్రమంలో రాలి పోయిందా అన్నది తేలాల్సి ఉంది.వాస్తవానికి ఈ ఘటన వెలుగులోకి రావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న బంగారు, వెండి కానుకలను కొందరు మాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా ఆకుపచ్చ రత్నం మాయం అవడంపైనా అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. అయితే మాయమైన రత్నం పెద్దగా విలువ చేయదని ఆలయ అర్చకులు అంటున్నారు. పూజ చేసే క్రమంలోనే రాలిపోయి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Image result for ammavari temple

నిజానికి అమ్మవారికి సంబంధించిన వెండి, బంగారు ఆభ‌ర‌ణాల కానుక‌ల లెక్కలు ఎప్పటిక‌ప్పుడు చూపించాలి. పార‌ద‌ర్శక‌త కోసం భ‌క్తుల‌కు కూడా అధికారికంగా వెల్లడించాలి. కానీ ఇక్కడ అంతా గోప్యంగా మారుతోంది. అమ్మవారి ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. గ‌త ద‌శాబ్ధ కాలంలో భ‌క్తులతాకిడి అంత‌కంత‌కూ పెరుగుతోంది. అమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, భారీగా కానుకలు సమర్పిస్తుంటారు.రెండేళ్ల క్రితం అమ్మవారి ఉత్సవ విగ్రహ త‌ర‌లింపు అంశం వివాదాస్పదం అయింది. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో అమ్మవారి వెండి, బంగారు కానుక‌ల‌కు సంబంధించిన అక్రమం వెలుగు చూసింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకుడి ఆధీనంలో గల బీరువాల్లో భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్రధాన అర్చకుడి బీరువాల నుంచి 434 గ్రాముల వెండి బిస్కట్ తో పాటు , ఒక చిన్న బంగారు ముక్కు పుడక దొరికింది. ఇదొక్కటే కాదు ఎనిమిదేళ్ల క్రితం ఓ భ‌క్తురాలు అమ్మవారి అలంక‌ర‌ణ కోసం 5 తులాల బంగారు ముక్కుపుడ‌క‌ను స‌మ‌ర్పించింది.(21)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *