2019 లో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే

By | June 8, 2019

మ‌నలో చాలా మంది జాత‌కాలు న‌క్ష‌త్రాలు తిధులు న‌మ్ముతారు దానికి అనుగుణంగా వారి జీవితంలో ఎటువంటి దోషాలు ఉన్నాకి నివార‌ణ ఏమిటి అనేది కూడా ఆలోచిస్తారు ఆ పూజలు చేస్తారు ఈ స‌మ‌యంలో ఓ రాశి గురించి తెలుసుకుందాం.శుక్రుడు ఏ రాశిలో ఉంటె ఆ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారా. శుక్రుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు జన్మించినవారి జాతకం చాలా గొప్పగా ఉంటుందట‌. వీరు చాలా అదృష్ట జాతకులు అని చెప్పవచ్చు. స్త్రీ,పురుషులు ఎవరైనా సరే శుక్రుడు దనస్సు రాశిలో ఉన్నావారైతే వారి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైన సరే ఆర్ధికంగా మంచి స్థిరత్వం ఉంటుంది. వీరి దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వీరి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భగవంతుని అనుగ్రహంతో చివరి నిమిషంలో ఆ సమస్యల నుండి బయట పడతారు. వీరికి పుట్టే సంతానంనకు గొప్ప పరిణితి,జ్ణానము ఉంటాయి.
మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన పురుషులకు ఉధ్యోగము చేసే లేదా సంపాదించే భార్య భాగస్వామిగా వస్తుంది. వారి జీవితంలో లౌకికమైన మరియు సమాజపరమైన విషయాలలో అద్భుతమైన సంపదను కలిగి ఉంటారు. గృహ నిర్మాణం,అద్భుతమైన స్థిరస్తుల కొనుగోళ్ళు చేస్తారు. వారు చేస్తున్న రంగంలో ఉన్నత స్థితికి వెళ్ళతారు. మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన స్త్రీలలో వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరు కొన్ని సందర్భాలలో మొండిగా,వితండవాదం చేసే వారీగా ఉంటారు. వీరికి వచ్చే భర్త కాస్త బాధ్యతారాహిత్యంగా ఉంటారు. అలాగే కొన్ని వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంది.

Image result for kumba rasi symbol

కుంబ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన వారు ఆగర్భ సీమంతులు అవుతారు. కుంబ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన మగవారిని పరిశీలిస్తే వీరంత అదృష్టవంతులు లేరనే చెప్పాలి. వీరికి మంచి భాగస్వామి దొరుకుతుంది. వీరు ఎంచుకున్న రంగంలో మంచి స్థితిలో ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా వీరి వెంటే సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవారికి,మీడియా రంగంలో ఉన్నవారికి,సినిమా రంగంలో,రాజకీయ రంగంలో ఉన్నవారికి కుంబ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కుంబ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన స్త్రీలలో సంపాదన పరంగా బాగానే ఉన్నప్పటికి వృత్తిలో స్థిరత్వం లేక పోవటం వలన తరచుగా ఉధ్యోగాలు మారుతూ ఉంటారు. వీరి మనస్సు చాలా మంచిది. వీరు ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే వీరు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద ఆధారపడి జీవిస్తారు.


loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *