బాబు డ్రామాను బ‌య‌ట‌పెట్టిన అంబ‌టి

By | June 8, 2019

ఏపీ రాజ‌కీయాల్లో ఇటు ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార పార్టీ టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్దాలు జ‌రుగుతున్నాయి… నువ్వా నేనా అనేలా పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.. చంద్ర‌బాబు నాయుడు మాట‌లు ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన ఏ హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని, ఇప్పుడు ప్ర‌జ‌లు ఆయ‌న్ని న‌మ్మే స్దితిలో లేరు అని అన్నారు.

Image result for ambati rambabu

పార్ల‌మెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి… అందుకే ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామాకు తెరలేపిందని విమర్శించారు ఆయ‌న . పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసంపై ప్రగల్భాలు పలుకుతోందని విమ‌ర్శించారు అంబ‌టి రాంబాబు.. కేంద్రంపై అందరికంటే ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసం పెడితే విమర్శించిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.

Image result for chandra babu

పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిరోజే టీడీపీ ఆమోదం పొందడం వెనుక కుట్ర లేదా అని అంబటి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇది కొత్త ట్విస్ట్ అని.. తమ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చర్చ జరపలేదని, ఎందుకు హెడ్ కౌంట్ చేయలేదని ఆయ‌న నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారని, వాటి వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.. ముఖ్యంగా ఈ భేటీ త‌ర్వాత ఇటువంటి ప‌రిణామాలు జ‌రిగాయి అని విమ‌ర్శించారు ఆయ‌న‌.. దీనిపై ఎన్టీయే స‌మాధానం చెప్పాలి అని ఆయ‌న ప్ర‌శ్నించారు.Prev postNext postLeave a Reply

Your email address will not be published. Required fields are marked *