బాబుని వ‌ద‌ల‌ని విజ‌య‌సాయిరెడ్డి

By | June 8, 2019

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పై, వైసీపీ అధినేత జ‌గ‌న్, ఎంపీలు, ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు చేయ‌డం షరా మాములే.. ఇటు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ‌సాయిరెడ్డి వైసీపీ ఎంపీగా పార్టీలో నంబ‌ర్ 2గా ఉన్నారు.. విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం అధినేత పై స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా, విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడ‌తారు.. ముఖ్యంగా తెలుగుదేశం పై ఫిరాయింపులు అనే మాట‌ని ఎక్కువ‌గా ఉప‌యోగించిన నేత కూడా ఆయ‌నే.. ఇక ప్ర‌త్యేక హూదా విష‌యంలో..

Image result for chandra babu

ఇక ప్ర‌ధాని కాళ్లు పార్ల‌మెంట్ లో విజ‌య‌సాయిరెడ్డి ప‌ట్టుకున్నారు అని తెలుగుదేశం ఎన్నో విమ‌ర్శ‌లు చేసింది.. గ‌తంలో సీఎం ర‌మేష్ అయితే దీనిపై తాను ఎంత దూరం అయినా వెళ‌తా, ఇది నిజం వాస్త‌వం అని, కావాలంటే పుటేజ్ చూపిస్తా అని అన్నారు.. దీంతో విజ‌య‌సాయిరెడ్డి కూడా ఇలాంటి వ‌క్రవ్యాఖ్య‌లు వ‌ద్ద‌ని అక్క‌డ జ‌రిగింది ఏమిటో తెలియ‌చేశారు. అయితే ఇటు విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు పై చేసే విమ‌ర్శ‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ అవుతాయి. ఇక మంత్రి నారాలోకేష్ పై కూడా ఆయ‌న విరుచుకుప‌డ‌తారు.

Image result for vijya sai reddy

ప్ర‌త్యేక హూదా ఉద్య‌మం ముందు నుంచి స‌రైన ప‌ద్ద‌తిలో చేస్తుంది వైసీపీ మాత్ర‌మే అని, తెలుగుదేశం ఓ ప్ర‌ణాళిక లేకుండా చేస్తున్న ప‌ని అని, వారి ద‌గ్గ‌ర ఎటువంటి ప్ర‌ణాళిక‌లు లేవు అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.. చంద్ర‌బాబు అడిగారు అందుకే కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది.. ప్యాకేజీ ఇచ్చేట‌ప్పుడు చంద్ర‌బాబు వ‌ద్దు అని అంటే క‌చ్చితంగా ప్యాకేజీ ఆగిపోయేది అనేలా వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.

loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *