పులిపిరులను సులువుగా తొల‌గించుకునే ఇంటి చిట్కా మిస్ కాకండి

By | June 8, 2019
Image result for పులిపిరులు

పులిపిరులు అనేది పెద్ద స‌మ‌స్య‌గా ఇటీవ‌ల చెప్పుకుంటున్నారు అంద‌మైన ఫేస్ కు న‌డుము కు కాళ్లు చేతుల పై ఇవి రావ‌డంతో చాలా నామోషీగా ఫీలు అవుతూ ఉంటారు….వైరస్ కారణంగా వచ్చే పులిపిరులు సాధారణ సమస్యే అయినా కొంత ఇబ్బందికి గురిచేస్తుంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వచ్చే పులిపిరి కాయలను వార్ట్స్ అని పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా యుక్త వయస్సులో ఉండే వారికి వస్తుంటాయి. పురుషులకంటే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి. ఈ క్రమంలోనే పులిపిరులను తగ్గించుకోవాలంటే అందుకు మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణాల వలన పులిపిరులు తగ్గుతాయి. వాటిని చితక్కొట్టి పులిపిరులు ఉన్న చోట అద్దాలి. ఇలా కనీసం రెండు మూడు వారాల పాటు రోజూ చేస్తుండాలి..

ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని స్పూన్‌తో తొలగించి సముద్రపు ఉప్పుతో అందులో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసి ద్రవం తయారవుతుంది. దాన్నితీసి నిల్వ చేసుకుని 30 రోజుల పాటు రోజూ వాటిపై రాస్తుంటే పులిపిరులు రాలిపోతాయి. ఆముదం కూడా బాగా పనిచేస్తుంది. రోజూ ఒక చుక్క ఆముదం తీసుకుని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడా వారాల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరి కాయలపైన రాస్తుంటే రాలిపోతాయి. అయితే ఇలా చేసేటప్పుడు పక్కనున్న చర్మానికి ఏమాత్రం సున్నం తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే సున్నం తగిలిన ప్రాంతంలో బొబ్బలు వస్తాయి. అవిసె గింజల నూనెకు కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని పులిపిరుల మీద అప్లై చేసి బ్యాండేజీ కట్టేయాలి. సాయంత్రం బ్యాండేజిని తీయాలి. ఇలా పులిపిరులు రాలేంత వరకు చేస్తుండాలి.

కర్పూరం ఆయిల్‌ని పులిపిరులు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. బంగాళదుంప ముక్కలను పులిపిరులు ఉన్న ప్రదేశంలో రబ్ చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పులిపిరులు రాలిపోతాయి. అరటి పడు తొక్క కూడా పులిపిరులను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. రోజూ రాత్రి పూట అరటి తొక్కలోపలి భాగం పులిపిరులకు తగిలేటట్టుగా ఉంచి ఉంచి దానిపైన ప్లాస్టర్ వేసి ఉదయాన్నే తీసెయ్యాలి. ఇలా తగ్గేంత వరకు చేస్తుంటే ఫలితం ఉంటుంది మరి చూశారుగా సింపుల్ టెక్నిక్ తో ఇలా చేసి పులిపిర్ల‌ను తొలిగించుకోవ‌చ్చు, మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ ల‌రూపంలో తెలియ‌చేయండి.


loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *