పార్ల‌మెంట్లో మ‌హేష్ బాబు గురించి చెప్పిన గ‌ల్లా జ‌యదేవ్ చప్ప‌ట్లు కొట్టిన ఎంపీలు

By | June 8, 2019

ఏపీలో ప్ర‌త్యేక‌హూదా పోరు హ‌స్తిన వ‌ర‌కూ తీసుకువెళ్లింది తెలుగుదేశం పార్టీ… ఈరోజు పార్ల‌మెంట్లో గ‌ల్లా జ‌యదేవ్ అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ‌ను మొద‌లుపెట్టారు..ఇక స‌భ మొద‌లు అయిన త‌ర్వాత ఏపీని తెలంగాణ నుంచి ఎలా విభ‌జించారో తెలియ‌చేశారు.. ఆనాడు కెమెరాలు టీవీలు ఆపివేసి త‌లుపులు మూసి స‌భ‌లో తెలంగాణ బిల్లు ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆయ‌న అన్నారు..

Image result for mahesh babu

ఇక అవిశ్వాసం పై చ‌ర్చ మొద‌లు పెట్టిన స‌మ‌యంలో గ‌ల్లా జ‌య‌దేవ్ ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు.. చర్చలో భాగంగా ఆయన తన బావమరిది హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా గురించి ప్రస్తావించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కథే ‘భరత్ అనే నేను అని స్పీకర్‌కు గల్లా వివరించారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలందిస్తాడని గల్లా చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రమాణాన్ని నిలుపుకోవాలని, అలా నిలుపుకోక పోతే మనిషే కాదని ఆ సినిమాలో ఉన్న డైలాగ్‌ను గల్లా ఆంగ్లంలో అనువదించి సభలో ప్రస్తావించారు. ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ప్రమాణాలను కేంద్రం నిలుపుకోలేదని గల్లా చెప్పారు.

Image result for modi

మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఈ స‌మ‌యంలో భ‌ర‌త్ అనే నేను సినిమా గురంచి ప్ర‌స్తావించి చెప్ప‌డంతో, ఇటు మ‌హేష్ అభిమానుల‌నే కాదు ఇటు ఏపీ ప్ర‌జ‌లు అంద‌రూ ఆయ‌న వైపు మ‌రిలేలా చేసుకున్నారు… భ‌ర‌త్ అనే నేను సినిమాలో ఇచ్చిన మాట కోసం మ‌హేష్ ఎటువంటి ప‌ని చేశారు అనేది సినిమాలో కొర‌టాల చ‌క్క‌గా చూపించారు.. ఇది ఇక్క‌డ సంద‌ర్బానుసారంగా గ‌ల్లా జ‌య‌దేవ్ వాడారు అని అంటున్నారు.. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ అలాగే కేంద్ర హూంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆసాంతం, గ‌ల్లా జ‌య‌దేవ్ మాట‌ల‌ను వింటూ ఉన్నారు.


loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *