తిరుమల శ్రీవారి హుండీ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.!

By | June 8, 2019

తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యం. ఈ ఆల‌యం గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంత‌టి గుర్తింపు పొందింది ఈ ఆల‌యం. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజూ వేల‌ల్లో ఉంటుంది. ఇక ప్ర‌త్యేక పూజ‌లు, ఉత్స‌వాలు జ‌రిగిన‌ప్పుడు అయితే ఆ సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తాయి. ఇక పండుగలు, విశేషదినాల్లో ఏడుకొండల వేంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి.ఇవన్నీ హుండిలోకే వెళ్తాయి.అయితే మీకు శ్రీవారి హుండీ గురించి మీకు తెలుసా..ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము.

Image result for తిరుమల శ్రీవారి హుండీ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.!
  1. శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు. దీన్ని కొప్పెర అని కూడా అంటారు.
  2. బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణేలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచీ ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటి వలె తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి.
  3. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంతో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కాగంగాళాన్ని కొప్పెర అని అందుకే అంటారు.
  4. 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. ఈస్టిండియా కంపెనీవారి చట్టం బ్రూస్కోడ్- 12లో దీని వివరాలు ఉన్నాయి.
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *