ఇవి పాటించండి.. బరువు తగ్గండి!

By | June 8, 2019

బరువు తగ్గడానికి ‘షార్ట్‌ కట్స్‌’ అంటూ ఏమీ లేవు. అయితే కానీ కొన్ని ‘స్మార్ట్‌ కట్స్‌’ మాత్రం ఉన్నాయి. అవి పాటిస్తే మీ బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎంతకఠినమైన వ్యాయామాలు చేస్తున్నా, క్లిష్టమైన డైటింగ్‌ చేస్తున్నా ఈ సూత్రాలు పాటించకపోతే అవి పెద్దగా ఉపయోగపడవు. అందుకే ఈ చిట్కాలు కూడా పాటించి ఆరోగ్యంగా బరువు తగ్గండి. ఎక్కువ నమలండి.. తక్కువ తినండి!ఎవరో తరుముతున్నట్టు చాలా వేగంగా తినేస్తారు కొంతమంది. అదే బరువు పెరగడానికి కారణమట. తినడం మొదలుపెట్టిన 20 నిమిషాల తర్వాతే పొట్ట నిండిందన్న సంకేతం మెదడుకు చేరుతుందట. అందుకే తీసుకున్న ఆహారాన్ని ఎక్కువ సేపు నమిలి మింగాలట. ఒక్కసారి నోట్లో ఆహారం పెట్టుకున్న తర్వాత 35 నుంచి 50 సార్లు నమలాలట. ఇలా చేయడం వల్ల పొట్ట నిండినట్టినిపించి ఎక్కువ ఆహారం తీసుకోలేమట.

Image result for ఇవి పాటించండి.. బరువు తగ్గండి!

 చూసి తినండి: అన్నం తినేటపుడు మాట్లాడడమో, టీవీ చూడడమో చేయకూడదు. తీసుకుంటున్న ఆహారం పట్ల శ్రద్ధ కనబర్చాలి. ఏం తింటున్నామో చూడాలి. ఆహారం నమలడాన్ని, అది గొంతులోకి దిగుంతడాడాన్ని గమనించాలి. మన మెదడు ఒకేసారి ఎక్కువ పనులను నియంత్రించలేదు. అందుకే భోజనం చేసేటపుడు స్నేహితులతో మాట్లాడడడమో, టీవీ చూడడమో చేస్తే మెదడు ఆహారం మీద నియంత్రణ కోల్పోతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఎక్కువ ఉడికంచకండి: ఎక్కువ ఉడికిన, వేయించిన పదార్థాల్లో పోషకాలు, ఖనిజాలు ఉండలేవు. కొన్ని పదార్థాల్లో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌.. వాటిని వేడి చేయగానే నాశనమవుతాయి. తగినంత న్యూట్రియెంట్స్‌ లేని అలాంటి ఆహారం సంతృప్తినివ్వదు. అందుకే వెంటనే జంక్‌ ఫుడ్‌ వైపు పరుగులు తీస్తారు. అందుకే కాయగూరలను మరీ ఎక్కువ సమయం స్టౌ మీద ఉంచకూడదు.

loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *